హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావు నివాసాన్ని ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు శుక్రవారం ముట్టడించారు. ప్రత్యేక తెలంగాణపై పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని వీరు అంబర్ పేటలోని ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ సమస్యను సోనియా దృష్టికి తీసుకువెళ్లాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.