హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను అర్పించిన శ్రీకాంత్ కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించేవరకూ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేది లేదని టీఆర్ ఎస్ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ దీక్షకు ఉత్తేజితుడై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీకాంత్ వంటిపై పెట్రోలు పోసుకుని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీకాంత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మృతుడు శ్రీకాంత్ కుటుంబానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.