గ్రేటర్ ను గ్రేట్ చేస్తా : మేయర్ హైదరబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని నూతనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మేయర్ కార్తీక రెడ్డి మీడియాతో అన్నారు. మేయర్ గా ఎన్నికైన అనంతరం కార్తీక ముఖ్యమంత్రి రోశయ్యను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ను కూడా కాలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నగర అభివృద్ధికి అధికారులు, నేతల సమన్వయంతో చక్కని ప్రణాళికలను అమలు చేసి గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అధునాతన నగరంగా తీర్చిదిద్దుతాన్నారు.
News Posted: 4 December, 2009
|