అసెంబ్లీలో ఎమ్మెల్యేల దీక్ష హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు మద్దతుగా మరో తాజా అంకానికి అసెంబ్లీ వేదికయింది. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఓదెల, కొప్పుల ఈశ్వర్ గడియవేసుకుని నిరాహార దీక్షకు ఉపక్రమించారు. తక్షణం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని, లేని పక్షంలో తమ చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తలుపులు తీసేందుకు ప్రయత్నిస్తే వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతమాని వారు హెచ్చరించారు.
News Posted: 4 December, 2009
|