నిమ్స్ వద్ద ఉద్రిక్తత హైదరాబాదు : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణ విద్యార్థులు, నేతల్లో ఆందోళన మొదలైంది. జై తెలంగాణా అంటూ వేలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలు నిమ్స్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. విద్యార్థులకు పోలీసులకు మద్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా తరలి వస్తున్న జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
News Posted: 5 December, 2009
|