బ్లాక్ డేకు ర్యాలీలు నిషేధం హైదరాబాదు : బ్లాక్ డే సందర్భంగా హైదరాబాదులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి నగరంలో 144 సెక్షన్ విధించినట్లు ఆయన వెల్లడించారు. ఉద్రిక్తతకు అవకాశమున్న 200 ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు కమిషనరు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో ప్రదర్శనలు, ర్యాలీలు నిషేధించినట్లు ఆయన ప్రకటించారు.
News Posted: 5 December, 2009
|