'రోగులను ఇబ్బంది పెట్టొద్దు' హైదరాబాద్ : తెలంగాణ సాధన కోసం నీరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, కోమాలోకి వెళ్లారన్న వార్తలు అబద్దమని, అసలు కోమా అనేది కేసీఆర్‌కు ఉండదని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. నిమ్స్ ఆస్పత్రిలో వేలాది మంది రోగులు వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారికి ఇబ్బందులు కలిగించ వద్దని, భయాందోళనకు గురి చేయవద్దని నిమ్స్ డైరెక్టర్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నీరసంగా ఉండడంతో ముందు ముందు ఏదైనా అత్యవసర చికిత్స చేయాల్సి వస్తే వీలుగా ఉంటుందని ఐసీయూలో ఉంచామని నిమ్స్ డైరెక్టరు తెలిపారు.
News Posted: 5 December, 2009
|