హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా ఎస్.ఐ.శ్యామ్ సుందర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణా రావాలని కోరుతూ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. నేనే కాదు నాలా తెలంగాణ కావాలని కోరుకునేవారు పోలీస్ శాఖలో చాలా మంది ఉన్నారు. ఆ అభిప్రాయం ఉన్నవాళ్ళు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహించడానికి వచ్చిన శ్యాంసుందర్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.