హైదరాబాద్ : హైదరాబాద్ లోని వివిధ కోర్టుల న్యాయవాదులు విధులను బహిష్కరించి రోడ్లపై ధర్నా చేప్టటారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో తొలి రెండు రోజుల్లో ప్ర్రత్యేక తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఈనెల 10న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.