హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రారంభమైన శాసనసభా సమావేశాలలో ముఖ్యమంత్రి కె.రోశయ్య వైఎస్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల హృదయాలలో కొలువైన జననేతను కోల్పోవడం తీరని లోటన్నారు. కాగా ముఖ్యమంత్రి సంతాప తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు టీఆర్ఎస్ సభ్యులు అడ్డుతగలడంతో వారిపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను గౌరవించాలని వారిని కోరారు.