హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామాలు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్చేశారు. ఆయన నిమ్స్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రోశయ్య ప్రభుత్వం బీటలు వారిద్దన్నారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని దీక్ష విరమించాలని కుటుంబ సభ్యులంతా కోరామన్నారు. అయితే ఆయన దీక్ష విరమించడానికి ఇష్టపడడం లేదన్నారు.