కొనసాగుతున్న ఆందోళనలు హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. మౌలాలిలో తెరాస కార్యకర్తల రైల్ రోకో చేపట్టి పుష్ పుల్ రైలును అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో వేలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి రాస్తారోకో చేశారు. రోడ్డుకిరువైపులా మానవహారం చేపట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలాలలో తెరాస, సీపీఐ, న్యూడెమోక్రసీ కార్యకర్తలు ఎంపీపీ ఇంటిని ముట్టడించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు పెన్ డౌన్ చేపట్టారు. లక్కెట్టి పేటలో తహసీల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలను తెలంగాణ జేఏసీ నేతలు ముట్టడించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో సోనియా, రోశయ్యల దిష్టిబొమ్మలను దున్నపోతులపై ఊరేగించి తమ నిరసనను తెలియజేశారు.
News Posted: 8 December, 2009
|