బీజేపీ ఎమ్మెల్యేల ధర్నా హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా అసెంబ్లీ వద్ద భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోకపోతే బుధవారం అన్ని జాతీయ రహదారులను దిగ్భందం చేస్తామన్నారు. అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగిన ఆ పార్టీ అధ్యక్షుడు దత్తాత్రేయ, లక్ష్మణ్ తో సహా పలువురు కార్యకర్తలు అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
News Posted: 8 December, 2009
|