'అసెంబ్లీ జరగనివ్వం' హైదరాబాద్ : తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం జరిగేవరకూ సమావేశాలు జరగవని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణపై అట్టుడికిన సభ బుధవారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ జిల్లాలు అగ్నిగుండాలుగా మారాయని, ఇంకా తమ సహనానికి పరీక్ష పెట్టవద్దని అన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన అన్నారు.
News Posted: 8 December, 2009
|