ఉద్రేకాలకు లోనుకావద్దు : రోశయ్య హైదరాబాద్ : ఆంధ్రా, రాయలసీమ విద్యార్థులు ఎలాంటి ఉద్వేగాలకు లోను కావద్దని ముఖ్యమంత్రి రోశయ్య విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా ఆందోళనను తెలియజేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను నాశనం చేయొద్దన్నారు. సాధారణ ప్రజానీకానికి ఆటంకం కలిగించొద్దని ఆయన సూచించారు. రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా, శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు
News Posted: 11 December, 2009
|