హైదరాబాద్ : సమైక్యాంధ్రను నినదిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వీరంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని వీరు ఆరోపించారు.