కోస్తా, సీమల్లో రిలే నిరాహార దీక్షలు హైదరాబాద్ : సమైకాంధ్రను కోరుతూ కోస్తా, సీమల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల బంద్ కు పిలిపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్ర తీసున్న నిర్ణయాన్ని వీరు నిరసిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్థసారధి, పల్లె రఘునాధరెడ్డి, పరిటాల సునీతలు అనంతపురంలో ఆమరణ దీక్షకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన పోలీసు అనదనపు బలగాలు అనంతపురం వచ్చాయని ప్రత్యేక పోలీసు అధికారిణి చారుసిన్హా తెలిపారు. విద్యార్థుల ఆందోళన హిసాత్మకంగా మారితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ పాటిస్తున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు బంద్ చేశారు.
News Posted: 14 December, 2009
|