నగరంలో బుక్ ఫెయిర్ హైదరాబాద్ : నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రారంభమైన 24వ బుక్ ఫెయిర్ 240 స్టాళ్ళతో పుస్తక ప్రియులను అలరిస్తోంది. పుస్తక ప్రియులను అలరిస్తున్న ఈ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారని బుక్ ఫెయిర్ సొసైటీ కమిటీ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. 19వ తేదీన పుస్తక ప్రియులకోసం పాదయాత్ర (వాక్ ఫర్ బుక్స్) నిర్వహిస్తున్నామన్నారు. 20వ తేదీన 2009 సంవత్సరానికి చెందిన ఉత్తమ పుస్తకాల ప్రదర్శన, 21వ తేదీన సైన్స్ యూనివర్శిటీ పుస్తక ఆవిష్కరణ, 23వ తేదీన పర్యావరణం-పొంచి ఉన్న ప్రమాదం అనే అంశంపై ఎమ్మెల్సీ నాగేశ్వర్ తో చర్చాగోష్ఠి, 24న హిప్నో కమలాకర్ రచించిన 10 పుస్తకాల ఆవిష్కరణ, 25వ తేదీన కొడవగంటి కుటుంబరావు, శ్రీశ్రీల శత జయంతి సభ, 26వ తేదీన పిల్లలు మంచి పౌరులుగా మారాలి అనే అంశంపై హిప్నాటిస్ట్ బివి పట్టాభిరామ్ ప్రసంగించనున్నారని ఆయన తెలిపారు.
News Posted: 17 December, 2009
|