హైదరాబాద్ : తెలంగాణ జిల్లాలో మూత పడిన జూనియర్ కాలేజీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి పి.బలరామయ్య తెలిపారు. శనివారం నుంచి ప్రారంభిస్తారని అధికారులు తెలిపినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచే కాలేజీలు ప్రారంభిస్తున్నారని తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో ఈనెల 4 నుండి కాలేజీలు మూతపడ్డ సంగతి విదితమే.