19న నీటి సరఫరా బంద్ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో ఖానాపూర్ నుంచి షేక్ పేట, భోజగుట్ట రిజర్వాయర్లకు నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వాయర్లకు నీటనని సరఫరా చేసే పైప్ లైన్లకు శనివారం మరమ్మతులు చేపడుతున్న కారణంగా టోలిచౌకి, మెదహీపట్నం, కాకతీయనగర్, విజయ్ నగర్ కాలనీ, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, అసెంబ్లీ ప్రాంతాలకు, కార్వాన్, ఓల్డ్ మల్లేపల్లి, ఎంఈఎస్, మంగళ్ పేట, ఆదర్శనగర్ ప్రాంతాలకు శనివారం పూర్తిగా నీటి సరఫరా ఉండదని తెలిపారు. ఆదివారం కూడా సరఫరా ఆలస్యం కావచ్చని జలమండలి పేర్కొంది.
News Posted: 18 December, 2009
|