లగడపాటి సెల్ పై పోలీసు కన్ను హైదరాబాద్ : నిమ్స్ లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు మంగళవారం ప్రయత్నించారు. అయితే, లగడపాటి వాగ్వాదానికి దిగడంలో పోలీసులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తన సెల్ ఫోన్ ను ఇచ్చేది లేదంటూ లగడపాటి పోలీసులతో తీవ్రంగా వాదనకు దిగారు. ఇలా ఉండగా నిమ్స్ లో కేసీఆర్ చికిత్స పొందినప్పుడు ఆయనను పరామర్శించేందుకు విజిటర్లను అనుమతించిన పోలీసులు లగడపాటిని ఎందుకు కలవనీయడం లేదని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ ప్రశ్నించారు.
News Posted: 22 December, 2009
|