పెరుగుతున్న కేసీఆర్ అసహనం హైదరాబాద్ : తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వైఖరి చూస్తుంటే తెలంగాణ రాదేమో అన్న అనుమానంతో అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నట్లున్నదని రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా ఆయనలో అసహనం మరీ ఎక్కువైపోయిందన్నారు. అందుకే ఆయన అనుచితంగా మాట్లాడుతున్నారని, రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారంనాడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, నాలుకలు కోసిపారేస్తామంటూ కేసీఆర్ హెచ్చరించడం సరికాదన్నారు. హైదరాబాద్ మాది అనడం అందరి హక్కు అన్నారు. సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్ లోనే ఉండి పోరాటం చేస్తామని మీడియా ప్రతినిధి ప్రశ్నకు రాంబాబు సమాధానం ఇచ్చారు.
News Posted: 23 December, 2009
|