సబర్బన్ సర్వీసులు రద్దు హైదరాబాద్ : తెరాస శ్రేణులు 48 గంటల బంద్ పిలుపుతో జంటనగరాల్లో నడిచే సబర్బన్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ గురువారం ఉదయం ప్రకటించింది. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదన్న ముందు జాగ్రత్త చర్యగా సర్వీసుల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. సబర్బన్ రైలు సర్వీసులను నిలిపివేయడంతో ప్రయాణికులు, ఉద్యోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
News Posted: 24 December, 2009
|