బాబు క్రిస్మస్ శుభాకాంక్షలు హైదరాబాద్ : ఏసుక్రీస్తు జన్మదినోత్సవం క్రిస్మస్ సందర్భంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పాలస్తీనాలోని బెత్లహామ్ లో పరిశుద్ధాత్మ శక్తితో జన్మించిన ఏసుప్రభువు యావత్ ప్రపంచ ప్రజానీకానికి వెలుగులు పంచారన్నారు. క్రిస్మస్ వేడుకలను శాంతియుత సహజీవనంతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన క్రిస్టియన్ సోదరులకు పిలుపునిచ్చారు. మానవ జీవితాల్లో చీకటిని పారద్రోలి పవిత్రతను చేకూర్చే క్రీస్తు దీవెనలు అందరికీ అందరికీ అనుగ్రహం పంచేదే క్రిస్మస్ నక్షత్రం అన్నారు.
News Posted: 25 December, 2009
|