గ్రేటర్ కు సమీర్ శర్మ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా సమీర్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐటీ, కమ్యూనికేషన్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. సమీర్ గతంలో విజయవాడ,విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గా పని చేసారు. పట్టణాభివృద్ధి అంశంపై అమెరికాలో పీహెచ్ డి చేసారు. నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తరువాత కమిషనర్ గా ఉన్న ఎన్ పి సింగ్ గత నెల ఏడో తేదీ నుండి దీర్ఘకాలిక శెలవుపై వెళ్లారు. జిహెచ్ఎంసికి స్పెషల్ కమిషనర్ గా ఉన్న ఎం టి కృష్ణబాబు ఇన్ ఛార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
News Posted: 1 January, 2010
|