హైదరాబాద్ : మంత్రి కొమటిరెడ్డి వెంకటిరెడ్డిని కేబినెట్ నుండి తప్చంచేందుకు కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. మంత్రివర్గం నుండి ఆయన్ను తప్పిస్తే తెలంగాణ మంత్రులంతా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిదంబరంపై వ్యాఖ్యలు చేసిన లగడపాటిపై అధిష్ఠానం ఎందుకు చర్య తీసుకోలేదని హరీష్ ప్రశ్నించారు.