హైదరాబాద్ : రాజధాని ఢిల్లీకి పయనమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు మార్గమధ్యంలో కాస్త బ్రేక్ పడింది. శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ వాదులు కొందరు ఆయన్ను అడ్డుకున్నారు. దయచేసి తెలంగాణకు అడ్డురావద్దని లగడపాటికి విజ్ఞప్తి చేసారు. అసలు ఢిల్లీకే వెళ్లవద్దంటూ అడ్డుతగిలారు. కొద్దిసేపటి తరువాత పరిస్థితి సద్దుమణగడంతో లగడపాటి వెళ్లిపోయారు.జై తెలంగాణ అంటూ నినాదాలు చేసారు.