రాష్ట్రపతి పాలన విధించాలి హైదరాబాద్ : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సమాఖ్య డిమాండ్ చేసింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల కారణంగా పారిశ్రామిక రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆ సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేసారు.పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలు రాజకీయ నిరుద్యోగులు, రిటైర్డ్ నాయకులు చేస్తున్నవేనని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు.
News Posted: 5 January, 2010
|