సెక్రటేరియట్లో పెన్ డౌన్ హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగులు బుధవారం పెన్ డౌన్ చేసారు. పీఆర్సీ నివేదిక సవరణను డిమాండ్ చేస్తూ ఉద్యగులు ఈ ఆందోళనకు దిగారు. రెండు రోజులు పాటు పెన్ డౌన్ చేయనున్నారు. జీవన ప్రమాణాలు పెరుగుతున్నప్పటికీ, తమ జీతభత్యాల్లో ఎటువంటి పెరుగుదల లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత జీవన స్థితిగతులకు అనుగుణంగా స్కేల్స్ ఆమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ డిమాండ్ పట్ల ప్రభుత్వం ఆశించిస స్థాయిలో స్పందించడంలేదని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 5 January, 2010
|