సాలార్ జంగ్ ఉత్సవాలు
హైదరాబాద్ : సాలార్ జంగ్ మ్యూజియం వారోత్సవాలు ఈ నెల 8 వ తేదీన ప్రారంభమై 14 వరకు కొనసాగుతాయని మ్యూజియం డైరక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 12న మహిళలు, బాలికలకు రంగోలీ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పోటీలు ఉంటాయన్నారు. 8-12 ఏళ్లలోపు బాలికలను ఒక గ్రూపుగా, 15 నుంచి21, 22 ఏళ్లు, ఆ పైబడిన వారిని మూడు గ్రూపులుగా విభజించామని పేర్కొన్నారు. సంప్రదాయ రంగవల్లులను చక్కటి చుక్కలతో తీర్చదిద్దాల్సి ఉంటుందని వివరించారు.
News Posted: 6 January, 2010
|