హైదరాబాద్ : ప్రభుత్వానికి తెలియకుండా ఆర్టీసీ చార్జీలు పెంచారని రవాణా శాఖ మంత్రి చేస్తున్న వాదనలో నిజం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. నిజంగా అలాగే చేస్తే ఆర్టీసీ అధికారులందరినీ ఈ పాటికే భర్తరఫే చేసేవారని ఆయన అభిప్రాయపడ్డారు.మరోవైపు ఉద్యోగుల జీతాలు పెంచినందునే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.