రాజకీయ పార్టీలదే బాధ్యత హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపునకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలని లోక్ సత్తా పార్టీ డిమాండ్ చేసింది. ఉద్యమాల పేరుతో ప్రభుత్వ అస్తులను ధ్వంసం చేసి, ఇపుడు ఛార్జీలు పెంపునకు నిరసనలు చేయడం ఆయా పార్టీల దగా కోరు తనానికి నిదర్శనమని ఆరోపించింది. పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కటారి శ్రీనివాసరావుతో ఉపాధ్యక్షుడు వై డి రామారావు మీడియాతో మాట్లాడారు. ప్రజల అస్తులను ధ్వంసం చేసిన రాజకీయ పార్టీలు నష్టాన్ని కూడా సామాన్యులపైనే మోపుతున్నాయని మండిపడ్డారు. ఛార్జీలు పెంచిన తీరు పాలనా వ్యవస్థ గాడి తప్పడాన్ని బయటపెడుతోందన్నారు. ఛార్జీలు పెంపు వంటి కీలకమైన నిర్ణయం కూడా ప్రభుత్వానికి, సంబంధిత మంత్రికి కూడా తెలియకపోవడం ప్రస్తుత దుస్థితికి నిదర్శనమన్నారు.
News Posted: 7 January, 2010
|