బస్టాప్ ల మార్పు హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సులు బయలుదేరే స్థానాలను ఆర్టీసీ శనివారం నుండి మారుస్తోంది. కర్నూలు, కడప, చిత్తూరు, ఆనంతపురం, ప్రకాశం, నెల్లూరు, జిల్లాలకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుండి బయలుదేరుతాయి. నల్లొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ వెళ్లే బస్సులు దిల్ సుఖ్ నగర్ నుంచి బయలుదేరుతాయి. జనగాం, యాదగిరిగుట్ట, హన్మకొండకు వెళ్లే బస్సు ఉప్పల్ ఎక్స రోడ్ నుండి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయి.తాండూరు, పరిగి, వికారాబాద్ వెళ్లే బస్సులు మెహదీపట్నం నుండి బయలుదేరుతాయి.
News Posted: 8 January, 2010
|