మార్చిలో ఇంటర్ పరీక్షలు
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి పదో తేదీ నుండి నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తొలుత మార్చి మూడో తేదీ నుండి నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేసారు. అయితే డిసెంబర్ మాసంలో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్రాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడంతో ముందుగా నిర్దేశించుకున్న అకడమిక్ షెడ్యూల్ దెబ్బతింది. దీంతో వార్షిక పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి మూడో తేదీ నుండి పరీక్షలు ప్రారంభంచాల్సి ఉన్నా సిలబస్ లు పూర్తి కానందున మార్చి 10 కి వాయిదా వేసారు. ఐఐటి-జేఈఈ,ఎఐఇఇఇ వంటి పరీక్షలు దృష్య్టా ఈ తాజా షెడ్యూల్ ను ఖరారు చేసారు.
News Posted: 9 January, 2010
|