దామోదర్ వ్యాఖ్యల ఖండన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వ్యాఖ్యలను ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చానళ్లలో వచ్చే వార్తా కథనాలతో సీఎంది, చిత్ర గుప్తుడి పాత్ర ఉందంటూ దామోదర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ విషయాన్ని సీఎం అధిష్టానానికే వదిలేసారన్నారు. రాష్ట వ్యాప్తంగా వై ఎస్ కు అభిమానులున్నారని, ఆబిమానం ఉన్నప్పుడు ఆవేశం ఉంటుందన్నారు. ఆ మాత్రానికే వేరే వాళ్లతో ముడిపెట్టడం సరికాదని దానం వ్యాఖ్యానించారు. కాగా,దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపాకు.
News Posted: 9 January, 2010
|