లోక్ సత్తా హర్షం హైదరాబాద్ : ప్రవాస భారతీయులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటనపై పీపుల్ ఫర్ లోక్ సత్తా హర్షం వ్యక్తం చేసింది. ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించాలని తమ సభ్యులు పోరాడుతున్నారని, ఆమెరికా, బోస్టన్,హూస్టన్, కాలిఫోర్నియాలతో పాటు బ్రిటన్ లోనూ అనేక చర్చా వేదికలను నిర్వహించారని ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని చేసిన ప్రకటనతో భారతదేశంలోని రాజకీయ సంస్కృతిని మార్చటంలో చురుకైన పాత్ర పోషించే అవకాశం ఎన్నారైలకు లభించిందని పీపుల్ ఫర్ లోక్ సత్తా తెలిపింది.
News Posted: 11 January, 2010
|