నెట్ లో హెచ్ఎండిఎ ప్లాన్ హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మాస్టర్ ప్లాన్ సిడిలను ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ వివరాలు ఇక నుంచి ఆన్ లైన్ లో లభ్యం అవుతాయని ఈ సందర్భంగా సిఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన హెచ్ఎండిఏ రెండో సర్వసభ్య సమావేశంలో ఈ సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలను ఫిబ్రవరి నెలాఖరు వరకూ స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం చివరి నాటికల్లా ఔటర్ రింగ్ రోడ్ 1, 2 ఫేజ్ పనులు పూర్తిచేయాలన్నారు. 2012 నాటికి హుస్సేన్ సాగర్ ఆధునికీకరణ పనులను ముగించాలన్నారు. 2014 సంవత్సరానికి అదనంగా 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు.
News Posted: 12 January, 2010
|