హైదరాబాద్ : భాగ్యనగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు త్వరలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి శాంతిర్యాలీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. శాంతి ర్యాలీ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తామన్నారు. అదుర్స్ చిత్రాన్ని అడ్డుకొవడాన్ని దానం తీవ్రంగా ఖండించారు.