పన్నులు తగ్గించాలి హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు పన్నులు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిస్తోందని తెలుగుదేశం పార్టీ మండిపడింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ భారీ స్థాయిలో టికెట్ ధరలు పెంచిందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. ఇపుడు తాజాగా వ్యాట్, ఎంవీ ట్యాక్స్ లు పెంచి ప్రజలపై పన్నుల భారం మోపారని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసారు. పెట్రోల్, డీజీల్, విద్యుత్తు చార్జీలను సైతం పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుండటం విచారకరమని గాలి అన్నారు. ధరల పెంపుదలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
News Posted: 13 January, 2010
|