సీమాంధ్ర నేతల భేటీ హైదరాబాద్ : కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన సీమాంధ్ర నేతలు మంగళవారం భేటీ కావాలని నిర్ణయించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సమావేశంలో సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, ప్రరాపాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా తెలంగాణ విషయంలో భవిష్యత్తు వ్యూహంపై చర్చించనున్నామని సమైక్యాంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరమ్ కన్వీనర్ ఎస్ శైలజానాథ్ తెలిపారు.
News Posted: 17 January, 2010
|