సీపీఐ రాష్ట్ర కమిటీ భేటీ హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం పార్టీ కార్యాలయంలో ప్రారంభమైంది. సీపీఐ నేతలు నారాయణ అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో తొలుత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం ఈ నెల 24 తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన సదస్సు జయప్రదం చేయటంపై చర్చించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తెలంగాణా అంశాలపై కూడా చర్చించారు.
News Posted: 18 January, 2010
|