లోక్ సత్తా అభిప్రాయసేకరణ హైదరాబాద్ : వేర్పాటు వాదంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు లోక్ సత్తా పార్టీ ప్రకటించింది. విశాఖ జిల్లాలోని కోటవురట్ల గ్రామంలో తాము ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్లు ఆ పార్టీ నేతలు విజయ్ చందర్ రెడ్డి, చెన్నయ్య, సరోజాదేవిలు వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న కోటవురట్ల గ్రమాంలో గ్రమసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని వివరించారు. అనంతరం విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర నేతలు వై డి రామారావు, భీశెట్టి బాబ్జీ, కటారి శ్రీనివాసరావులు పాల్గొంటారని పేర్కొన్నారు. తదనంతరం 23 తేదీన వరంగల్ జిల్లాలో అభిప్రాయసేకరణ జరుగుతుందని తెలిపారు.
News Posted: 18 January, 2010
|