హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని పీఆర్పీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవి తనపై గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన ప్రకటించారు. తాను గెలిస్తే చిరంజీవి సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేసారు.