హైదరాబాద్ : రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థతిపై గురువారం సీఎం రోశయ్య జిల్లాల ఎస్పీలతో సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. రాజధాని హైదరాబాద్ లో ని జూబ్లీ హాల్లో జరగాల్సిన ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. పరిస్దితులు చక్కబడిన తరువాత మరో రోజున సమావేశం ఏర్పాచు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.