హైదరాబాద్ : తెలంగాణ ధూంధాం కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ విజయశాంతికి రామాయంపేటలోని డి ధర్మారం గ్రామంలో ఘోర పరాభవం ఎదురైంది. ఆమె ప్రసంగాన్ని కొందరు తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. రసమయి బాలకిషన్ పాటలు పాడిన అనంతరం విజయశాంతి మాట్లాడాలని విజయశాంతి ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో అసహనానికి గురైన విజయశాంతి బయట వ్యక్తులు దగ్గర డబ్బులు తీసుకొని గొడవ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణ వాదులు విజయాశాంతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. దీంతో ఆమె సభా ప్రాంగణం నుండి దిగి వెళ్లిపోయారు.