ఆగిన డెక్కన్ కప్ హైదరాబాద్ : ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన టి-20 డెక్కన్ కప్ మ్యాచ్ రద్దైంది. తెలంగాణ వాదులు నినాదాలతో స్టేడియంలో చొరబడి మ్యాచ్ ను అడ్డుకోవడంతో నిర్వాహకులు టోర్నీని రద్దు చేసారు. స్టేడియంలోకి దూసుకువచ్చిన ఉద్యమకారులు జై తెలంగాణ, గో బ్యాక్ అంధ్రా నినాదాలతో హోరెత్తించారు. దీంతో మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది. హైదరాబాద్, అంధ్ర జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
News Posted: 21 January, 2010
|