హైదరాబాద్ : నగరంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి దొర్లింది. జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్న రాజేశ్వరి అనే విద్యార్థిని మొదట సృహ తప్పి పడిపోయింది. పాఠశాల యాజమాన్యం వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే రాజేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.