బైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావాన్ని ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ కార్ల యాత్ర చేపట్టింది. తెలంగాణ ఇచ్చేలా సోనియా గాంధీ మనసు మార్చాలని సమ్మక్క-సారాలమ్మను కోరుతూ మేడారం జాతరకు కార్ల ర్యాలీని సాగించారు. ఈ ర్యాలీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావం కావాలంటూ మేడారంలోని సమ్మక్క- సారలమ్మలకు వేడుకుంటామని పార్టీ కార్యకర్తలు వెల్లడించారు.