ఎన్ఎస్ యుఐ ఎన్నికలు హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ ఎన్నికలు గురువారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ జిల్లాల్లో పార్టీకి చెందిన ప్రతినిధులు ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు ఆంధ్ర ప్రాంతంలోనూ, శనివారం రాయలసీమ ప్రాంతంలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ ఎన్నికల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిటీకి ప్రతినిధులను ఎన్నుకుంటామని పేర్కొన్నాయి.
News Posted: 28 January, 2010
|