మేయర్ల సదస్సుకు కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : అఖిల భారత మేయర్ల సదస్సుకు హైదరాబాద్ నగర మేయర్ కార్తీక రెడ్డి హాజరవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే సదస్సులో అఖిల భారత మేయర్ల సంఘం ఉపాధ్యక్షరాలి హోదాలో ఆమె పాల్గొంటున్నారు. శుక్రవారం ఆమె ఢిల్లీ వెళ్లి యుపిఎ అధ్యక్షరాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కుమారి షెల్జాను ఆమె కలుసుకుంటున్నారు. నగరాభివృద్ధికి వేయి కోట్ల రూపాయలు కేటాయించాల్సిందిగా గతంలో చేసిన వినతిని పరిశీలించమని ఆమె కేంద్ర మంత్రులను కోరనున్నారు.
News Posted: 28 January, 2010
|